తెలంగాణ

కేసీఆరే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం ఇక్కడ పార్టీ ఆఫీసులో విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఒకనీతి, అధికార పార్టీకి మరో నీతిలాగే కనపడుతుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ వైఖరిని ఎండగట్టేందుకు ప్రజాతంత్ర, వామపక్ష, ప్రగతిశీల శక్తులు ఏకంకావాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఫిరాయింపులు పెరిగిపోయాయని అన్నారు. ఇతర పార్టీల్లో చేరిన ముగ్గురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై ఫిర్యాదు అందిన నెల రోజలలోపే వేటువేశారని అన్నారు. రెండోసారి గెలిచినా కేసీఆర్‌లో ఏలాంటి మార్పురాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పక్షానే్న టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ మండలి చైర్మన్ ప్రకటించడం దారుణమని అన్నారు.