తెలంగాణ

‘ఏకలవ్య’ పోటీల్లో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: రాష్ట్ర గిరిజన వ్యవహారాల శాఖ సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీట్‌లో తెలంగాణ విజయబావుటా ఎగురవేసింది. 111 పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అందులో 52 బంగారు పతకాలు, 43 వెండిపతకాలు, 16 రజతపతకాలున్నాయి. అథ్లటిక్ మీట్ చాంపియన్‌గా తెలంగాణకు చెందిన ఆర్ హరిలాల్ నిలవగా, బాలికల నుండి వీ స్వాతి చాంపియన్‌గా నిలిచారు. ఇద్దరూ తెలంగాణకు చెందిన వారు కావడం గమనార్హం. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రం నుండి 20 పాఠశాలలకు చెందిన 2వేల మంది పాల్గొన్నారు.