తెలంగాణ

సమాచారానికి అడ్డంకులుండరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: భారతీయ పౌరులను సాధికారికంగా రూపుదిద్దాలంటే సమాచారాన్ని అందుకోవడంలో వారు ఎదుర్కొంటున్న అడ్డంకులను తొలగించాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో యాంత్రికభాషానువాద ప్రాజెక్టును ఉప రాష్టప్రతి పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు పనిచేసిన ‘సార’ బృందాన్ని ఉప రాష్ట్రపతి అభినందించారు. మనం ఎవరో, మన చరిత్ర ఏమిటో, మన సమాజం ఏమిటో తెలియజెప్పేది మన భాషలేనని వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రాచీన భాషలు మృత భాషలుగా మారే ముప్పు ఏర్పడిందని, భాషలు క్షయం అయితే దాంతో పాటు మన చరిత్ర కూడా కనుమరుగైపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో భిన్నత్వం, వైవిధ్యాన్ని , సంక్లిష్టతలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వారి సొంత భాషల్లో, మాండలికాల్లో సమాచారాన్ని విజ్ఞానాన్ని చేరువ చేయాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ‘సార’ ప్రాజెక్టుతో ముందుకు వచ్చినందుకు ఉప రాష్ట్రపతి వర్శిటీ బృందాన్ని ప్రశంసించారు. సాంస్కృతిక పురోగతికి స్థానిక భాషలను ఎంతైనా ప్రోత్సహించాల్సి ఉంటుందని అన్నారు. యాంత్రిక అనువాదం రానున్న రోజుల్లో గొప్ప మలుపుకానుందని, యంత్రాలను మనం యంత్రాల్లా చూసే రోజులు పోయాయని, యంత్రాలు సైతం గతిశీలకంగా ఆలోచించడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలోనూ ముందుండబోతున్నాయని పేర్కొన్నారు. తక్కువ వ్యయంతో మరింత సమర్ధంగా యాంత్రిక అనువాదం సాధ్యం కాబోతోందని అన్నారు. ఇప్పటికిపుడు ఇదంతా సవాలుగా ఉన్నా, పరిశోధన దశ నుండి వాస్తవరూపంలోకి తీసుకురాగలిగితే సాధ్యమని అన్నారు. అది కూడా అంత తేలికైన పనికాదని చెప్పారు. కృత్రిమ మేథస్సే భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానం అవుతుందని వెంకయ్యనాయుడు పేర్కొంటూ ప్రపంచంలో ఎక్కడా లేని భాషా వైవిధ్యం భారత్‌లో ఉందని పేర్కొన్నారు.