తెలంగాణ

తిరుగు ప్రయాణమూ అవస్థే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 17: సంక్రాంతి పండుగను ముగించుకోని హైదరాబాద్‌కు చేరుకుంటున్న ప్రయాణికులు గురువారం ట్రాఫిక్‌లో చిక్కుకుని అనేక అవస్థలు పడ్డారు. జాతీయ రహదారిపై అడుగడుగునా ట్రాఫిక్ జామైంది. సాయంత్రం సమయంలో జాతీయ రహదారికి వాహనాల తాకిడి పెరిగింది. హైదరాబాద్‌కు వాహనాలు ఒక్కసారి పెరగడంతో చౌటుప్పల్ పట్టణంలో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ సీఐ వెంకటేశ్వర్లు పోలీసు బలగాలతో తంగడపల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సుమారు గంట సేపు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులుతీరకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వైపునకు 11 టోల్ గేట్లను తెరిచి ఎప్పటికప్పుడు వాహనాలను పంపిస్తున్నారు. రద్దీ పెరిగితే మరిన్ని టోల్‌గేట్లను తెరిచేందుకు ఏర్పాట్లు చేసారు.