తెలంగాణ

తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 17: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దగా, మెజార్టీ గ్రామపంచాయతీలలో టీఆర్‌ఎస్‌కు చెందిన సర్పంచ్‌లే ఏకగ్రీవమవుతున్నట్లు మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. గురువారం వర్గల్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు దేవగనిక నాగరాజు నేతృత్వంలో పార్టీ శ్రేణులు హరీష్‌రావును కలిసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. జరిగిన ప్రతిఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తుండగా, 90 శాతం పంచాయతీలలో టీఆర్‌ఎస్ సత్తా చాటుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పార్టీ పటిష్టతను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు ఐఖ్యమత్యంగా ఉంటూ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని, అలాగే టీఆర్‌ఎస్ సర్కార్ అమలు చేసిన వివిద సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లి చైతన్యం చేయాలని సూచించారు.
అంతేగాకుండా త్వరలో జరగనున్న ఎంపీ, మున్సిపల్, ఎంపీటీసీ, సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరారు.
చిత్రం..తనను కలిసిన టీఆర్‌ఎస్ నేతలతో
మాట్లాడుతున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు