తెలంగాణ

కాంగ్రెస్‌లో సీఎల్పీ చిచ్చు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 17: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పైకి ఐక్యతగా కనిపించిన జిల్లా కాంగ్రెస్ సీనియర్లు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి పిదప పరస్పరం విమర్శల పర్వం తిరిగి ప్రారంభించారు. పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు సీఎల్పీ నేత ఎన్నిక భేటీలో మరోసారి ఉత్తమ్ పట్ల తమ వ్యతిరేకతను వెళ్లగక్కారు. సీఎల్పీ నేతగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పాత బ్యాచ్‌లో ఎవరు వద్దంటూ, పార్టీ పదవుల్లో, సీఎల్పీ పదవుల్లో కొత్త వారికే అవకాశమిస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది సీట్లైనా గెలుస్తామంటు చిరుమర్తి బాహాటంగా తన అభిప్రాయాలు వినిపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు ఈ దఫా సీఎల్పీనేతగా అవకాశమివ్వాలంటూ కోరారు. ఈ పదవీ కోసం సీనియర్ ఎమ్మెల్యేలు ఉత్తమ్, భట్టీ విక్రమార్క, సుధీర్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, డి.శ్రీ్ధర్‌బాబు, టి.జగ్గారెడ్డిలు రేసులో నిలిచారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్‌రెడ్డి సీఎల్పీ పదవి కోసం గట్టి పట్టు పడుతు పార్టీలోని పలువురు ఎమ్మెల్యేల మద్దతు సైతం కూడగట్టారు. చివరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, సీఎల్పీ ఎన్నిక పరిశీలకులు వేణుగోపాల్‌ల పర్యవేక్షణలో సాగిన సీఎల్పీ సమావేశం వాడివేడిగా సాగింది. దీంతో ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ తేల్చకుండానే పార్టీ అధిష్టానానికే సీఎల్పీనేత ఎంపిక బాధ్యత అప్పగించడంతో అధిష్టానం సీఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద సీఎల్పీ ఎన్నిక సందర్భంగా మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు రచ్చకెక్కడంతో ఈ పరిణామాలు స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల తరుణంలో పార్టీకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు అందిస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యకమవుతుంది.
చిత్రాలు.. చిరుమర్తి..కోమటిరెడ్డి..ఉత్తమ్‌కుమార్ రెడ్డి