తెలంగాణ

మార్చి 31కల్లా కాళేశ్వరం పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/మహదేవ్‌పూర్, జనవరి 17: మార్చి 31 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు సివిల్ వర్క్స్ అన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్‌డీ శ్రీ్ధర్‌దేశ్‌పాండే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ, కనె్నపల్లి పంప్‌హౌజ్, కనె్నపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్, అన్నారం బ్యారేజీ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్దేశిత మార్చి 31 వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయడం కోసం తీసుకుంటున్న చర్యలను ప్రాజెక్టు ఇంజనీర్ల ద్వారా తెలుసుకున్నారు. రోజుకు ఎంతమంది కార్మికులను ఉపయోగిస్తున్నారని, ఎన్ని వాహనాలను పెంచాలని అడిగారు. అలాగే కనె్నపల్లి పంపుహౌస్‌లో పైప్‌లైన్ నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి మోటార్ల బిగింపు వేగంగా చేపట్టాలని అన్నారు. ప్రతిరోజూ 150 మీటర్ల గ్రావిటీ కెనాల్ లైనింగ్ పూర్తి చేయాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసే ప్రతి అధికారి, ఇంజనీరు, కార్మికులు అంకిత భావంతో పనిచేయడం వలననే ఇంత త్వరగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నందున ప్రాజెక్టు పూర్తి నిర్మాణం అయ్యే వరకు ఇదే అంకితభావంతో పని చేయాలని, వేగం తగ్గకుండా ఇలాగే పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు సిఇ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి, ఆర్‌డీవో వెంకటాచారి, ప్రాజెక్టు ఈఈ రమణారెడ్డి, ఎల్‌అండ్‌టీ, మెగా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్రం..ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్