తెలంగాణ

పౌరసరఫరాల సంస్థకు మంచి పేరు తెస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: పౌరసరఫరాలపై క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన ఉందని, గతంలో సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేయడంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, చెల్లింపులను ప్రత్యక్షంగా పరిశీలించానని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పౌరసరఫరాల భవన్‌లో శుక్రవారం సంస్థ చైర్మన్‌గా మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సమస్యలపై పూర్థి అవగాహన ఉందన్నారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దుతానన్నారు. తనపై ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని అన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో 38 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులు పూర్తి అయితే పెరగనున్న దిగుబడికి అనుగుణంగా కోటి టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించుకుంటామని మారెడ్డి అన్నారు. మారెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, కర్నే ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.