తెలంగాణ

అంపశయ్య నవీన్‌కు నేడు లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 18: లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీ రామారావు, స్వర్గీయ హరివంశరాయ్ బచ్చన్‌ల స్మృత్యర్థం ఏటా నిర్వహించే ఆంధ్ర జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఈ ఏడాది ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు ఈనెల 19న విశాఖలో ప్రదానం చేస్తామని లోక్‌నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విశాఖలోని లోక్‌నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్య వికాసంలో విశేష కృషి చేసిన నవీన్‌కు ఈ ఏడాది అవార్డును అందించేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. వీరితో పాటు బాలల వికాసానికి కృషి చేస్తున్న గుంటూరుకు చెందిన ఎన్.మంగాదేవికి, దివ్యాంగుల, కళా సాహిత్య సాంస్కృతిక రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌కు చెంది న వంశీ రామరాజుకు రూ.50 వేల నగదుతో పాటు జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. ఇప్పటి వరకూ 15 ఏళ్లుగా రాష్ట్రంలోని వివిధ రంగాల్లో సేవలందించిన వారికి అవార్డులు ప్రదానం చేశామన్నారు. ఆంధ్రజ్ఞాన్‌పీఠ్ అవార్డుతో పాటు రూ.1.50 లక్షల నగదును నవీన్‌కు అందిస్తామన్నారు. విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావు, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరువుతారన్నారు. అవార్డుల పురస్కార ప్రధానోత్సవంలో భాగంగా ప్రయోగం థియేటర్ గ్రూపు వారితో మొక్కపాటి నరసింహమూర్తి నవలకు నాటక రూపం బారిస్టర్ పార్వతీశం నాటికను ప్రత్యేకంగా ప్రదర్శిస్తామన్నారు.