తెలంగాణ

మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు 21న నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు 21వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలంగాణ పాఠశాల విద్యాశాఖాధికారులు తెలిపారు. జనవరి 28 నుండి ఫిబ్రవరి 28 వరకూ ఆరో తరగతిలో చేరేందుకు, ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకూ ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల వారికి ఆన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 9న హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆరో తరగతి వారికి ఉదయం 10 నుండి 12 గంటల వరకూ, 7,8,9,10 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకూ జరుగుతుంది. ఫలితాలను మే 18న విడుదల చేస్తామని వారు తెలిపారు. సీట్లు పొందిన వారి జాబితాను మే 19 నుండి మే 26 మధ్య ప్రకటించడం జరుగుతుందని, స్కూళ్ల వారీ ఎంపిక జాబితాలను మే 27న ప్రకటిస్తామని వారు చెప్పారు. మే 28 నుండి 30 మధ్య సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందని, క్లాసులు షెడ్యూలు ప్రకారం జరుగుతాయని చెప్పారు.