తెలంగాణ

సభలో ‘శే్వతవర్ణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ అసెంబ్లీలో శనివారం ‘తెలుపురంగు’ (శే్వతవర్ణం) పరుచుకుంది. పార్టీలకు అతీతంగా దాదాపు 110 మంది సభ్యులు తెలుపురంగు అంగీలు, తెలుపు రంగు ప్యాంట్లు, తెలుపురంగు పంచెలు ధరించి వచ్చారు. పాఠశాలల్లో విద్యార్థులంతా ఒకే తీరు ఒకే రకంగా ఉండే దస్తులు వేసుకుని వెళతారో, అదేవిధంగా శాసనసభ కూడా ఒక పాఠశాలలా మారిపోయింది. సాధారణంగా చాలా మంది టీఆర్‌ఎస్ సభ్యులు గులాబీరంగు అంగీలు, కాంగ్రెస్ సభ్యులు తెలుపురంగు అంగీలు వేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ తదితర పార్టీ సభ్యులంతా తెలుగు రంగు దుస్తుల్లోనే వచ్చారు. పార్టీ కండువాలు కూడా ఎవరూ ధరించలేదు. కాంగ్రెస్ సభ్యుల్లో ఇద్దరు, ముగ్గురు మాత్రం పార్టీ కండువా ధరించారు. మజ్లిస్‌కు చెందిన నలుగురు మాత్రమే షేర్వానీ ధరించి రాగా బీజేపీ సభ్యుడు రాజాసింగ్ కాషాయం దుస్తులు ధరించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, విపక్ష నేత భట్టి విక్రమార్కతో సహా సభ్యులంతా తెలుపురంగు దుస్తుల్లోనే వచ్చారు. దాంతో సభయావత్తూ తెలుపు రంగుతో నిండిపోయింది.