తెలంగాణ

సుస్థిర అభివృద్ధే యువత లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: కేంద్ర, రాష్ట్రాల్లో సుస్థర అభివృద్ధి ఏర్పాటే యువత ముందున్న ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత స్పష్టం చేశారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశాలపై రెండు రోజుల సదస్సు హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యువత నాయకత్వ సదస్సులో ఆమె ప్రసంగించారు. సదస్సునుద్దేశించి కవిత మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని అన్నారు. సుస్థిర అభివృద్ధికి యువత ఉత్సాహంగా పని చేయాల్సిన అవసరం ఎంతోఉందన్నారు. ఈ సదస్సులో కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుందన్న విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. యువత కలసికట్టుగా పోరాటం చేస్తే సమస్యల నుంచి అధికమిస్తామన్నారు. తెలంగాణ జాగృతి ఆహ్వానాలను అందుకుని దేశ విదేశాల్లో ఉన్న దాదాపు 550 మంది సదస్సుకు తరలిరావడం గర్వంగా ఉందన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలన్నీ మనకు మనం సృష్టించుకున్నవేనని ఆమె అన్నారు. ఏటా 22 వేల మంది చిన్నారులు చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఓ కార్యాచరణ, లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని కవిత పిలుపునిచ్చారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని ఆమె పిలుపునిచ్చారు. జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలను ముందే స్పష్టత ఉండాలన్నారు. నిరంతరం నేర్చుకోవాల్సిన జిజ్ఞాస కూడా యువతలో ఉండలన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు తరలిరావడంతో హెచ్‌ఐసీసీలో కోలాహలం మారింది. సార్క్ మాజీ ప్రధాన కార్యదర్శి అర్జున్ బహదూర్ థాపా ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యారు.. ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తా చర్చా గోష్టి చేపట్టారు. ప్యానలిస్టులుగా అసోం ఎంపీ గౌరవ్ గగోయ్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

చిత్రాలు.. హైదరాబాద్‌లో జరిగిన యువజన సదస్సులో అన్నాహజారే, ఎంపీ కవిత