తెలంగాణ

ఇంకుడు గుంతల కమిటీ వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) పరిధిలో భవనాలు, ఇండ్లు నిర్మించే సమయంలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలన్న విషయమై నియమించే కమిటీ వివరాలను సమర్పించాలని హైకోర్టు గురువారం జిహెచ్‌ఎంసిని ఆదేశించింది. హైకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది. 2009 జూన్ 9వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 350ను విడుదల చేసిందని, ఏపి బిల్డింగ్ రూల్స్ 2012లో అన్ని భవనాలు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు కలిగి ఉండాలని ఉందని, కాని అధికారులు సరిగా ఈ నిబంధనలను అమలు చేయడం లేదంటూ ఎస్ వైదేహి రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకుడు గుంతల కోసం ఒక కమిటీని వేయాలని గతంలో హైకోర్టు జిహెచ్‌ఎంసిని ఆదేశించింది. జిహెచ్‌ఎంసి తరఫున న్యాయవాది కేశవరావు వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఆదేశం మేరకు కమిటీని నియమిస్తామన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా నుంచి సలహాను తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది డి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ జెఎన్‌టియుకు చెందిన అనుభవం ఉన్న ఒక ప్రొఫెసర్‌ను ఈ కమిటీలో నియమించాలని కోరారు. ఈ ప్రతిపాదనకు హైకోర్టు అంగీకరించి కమిటీలో జెఎన్‌టియు ప్రొఫెసర్‌ను నియమించాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.