తెలంగాణ

భట్టి సమర్థుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ అసెంబ్లీలో సీఎల్‌పీ నేతగా మల్లు భట్టి విక్రమార్క నియామకాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమర్థించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎల్‌పీ నేతగా భట్టి సమర్థవంతంగా పని చేస్తారన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అండగా ఉంటారని అన్నారు. అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసిన తరువాతే భట్టిని సీఎల్‌పీ నేతగా ఎంపిక చేశారని ఆయన తెలిపారు. సీఎల్‌పీ పదవి కోసం పార్టీలో తీవ్రపోటీ జరిగిందని, అయితే అధిష్ఠానం భట్టివైపే మొగ్గుచూపిందని రాజగోపాలరెడ్డి చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీఎల్‌పీ ఎంపికను అధినాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా సమర్ధవంతగా పని చేశారని ఆయన గుర్తు చేశారు.