తెలంగాణ

గవర్నర్ ప్రసంగమంతా కేసీఆర్ హామీలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పలు సభల్లో ఇచ్చిన హామీల తరహాలో గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే డి. శ్రీ్ధర్ బాబు అన్నారు. శనివారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్ధేశించి ప్రసంగించారు. అనంతరం షబ్బీర్ అలీ, శ్రీ్ధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం, కొత్తగా నియామకాల గురించి చెప్పలేదని, ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించ లేదని వారు తెలిపారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారని, ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం జరిగిందని వారు తెలిపారు. ఇది అచ్చు తప్పా?, లేక ప్రభుత్వమే ఆ విధంగా మార్చిందా? అనేది స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై స్పష్టత లేదని వారన్నారు.