తెలంగాణ

పీఎఫ్ ఆంక్షల సడలింపు ఎప్పుడు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 20: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) కటాఫ్ డేట్ ఆంక్షలను సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఎత్తివేయాలని వేలాది మంది బీడీ కార్మికులు కోరుకుంటున్నారు. ఈ విషయమై ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార సభల్లో స్పష్టమైన వాగ్దానం చేయడం జరిగింది. ఈ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తే రాష్ట్రంలో సుమారు 80వేల మంది బీడీ కార్మికులకు జీవన భృతి రూపంలో లబ్ధి చేకూరనుంది. బీడీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 40వేల మంది జీవనభృతి పొందేందుకు అర్హత సాధిస్తారు. ఈ నేపథ్యంలో బీడీ కార్మికులంతా పీఎఫ్ కటాఫ్ డేట్ ఆంక్షల సడలింపు కోసం చకోరపక్షుల్లా ఎదురుతెన్నులు చూస్తున్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదట బీడీ కార్మికులకు జీవనభృతి కింద నెలకు వేయి రూపాయల పెన్షన్‌ను అందించేందుకు ఇదివరకు మార్గదర్శకాలను జారీ చేసింది. 2014 ఫిబ్రవరి 28వ తేదీలోపు ప్రావిడెంట్ ఫండ్ జాబితాలో పేర్లు కలిగి ఉన్న బీడీ కార్మికులకు మాత్రమే జీవనభృతి అందించాలని నిబంధన విధించారు. దీంతో 2014 ఫిబ్రవరి అనంతరం పీఎఫ్ ఖాతాలు తెరుచుకున్న వేలాది మంది బీడీ కార్మికులు ఈ నిబంధన కారణంగా జీవనభృతి పొందేందుకు అనర్హులుగా పరిగణించబడుతున్నారు. నిర్ణీత గడువుకు ముందు పీఎఫ్ చందాదారులుగా ఉన్న రాష్ట్రంలోని సుమారు మూడున్నర లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుండగా, మరో 80వేల మంది వరకు కార్మికులు జీవనభృతి ప్రయోజనానికి దూరంగా ఉండిపోవాల్సి వస్తోంది. నిజానికైతే పీఎఫ్‌తో సంబంధం లేకుండా నాన్ పీఎఫ్ కార్మికులకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవనభృతిని అమలు చేయాలని బీడీ కార్మికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ అక్రమాలకు ఆస్కారం లేకుండా పీఎఫ్ ఎన్‌రోల్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ముందస్తుగానే 2018చివరిలో అసెంబ్లీ ఎన్నికలు తెరపైకి రావడంతో పెద్ద సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులను ఆకట్టుకునేందుకు తెరాస అధినేత కేసీఆర్ మరోమారు జీవనభృతి అంశాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. జీవనభృతికి అడ్డంకిగా మారిన పీఎఫ్ కటాఫ్ డేట్ ఆంక్షలను తొలగించి 2018వరకు కూడా పేర్లు ఎన్‌రోల్ అయిన కార్మికులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని నిజామాబాద్ జిల్లా వేదికగా వాగ్దానం చేశారు. ఇదివరకు 2014 ఎన్నికల సమయంలోనూ ఇదే జిల్లాలోని మోర్తాడ్‌లో ఎన్నికల ప్రచార సభలో జీవనభృతి అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. దీంతో అప్పట్లోనూ నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బీడీ కార్మికులు తెరాస వైపు మొగ్గుచూపడంతో ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఉమ్మడి జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలను కైవసం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 7లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే, ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రెండున్నర లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోమారు బీడీ కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు తెరాస అధినేత కేసీఆర్ పీఎఫ్ కటాఫ్ డేట్ ఆంక్షలను ఎత్తివేస్తామని హామీ ఇవ్వడం సత్ఫలితాలు అందించిందనే చెప్పవచ్చు. ఇంచుమించు ఇదివరకటి తరహాలోనే ఈసారి ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలోని మొత్తం తొమ్మిది సెగ్మెంట్లకు గాను ఎనిమిది నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్థులనే తిరిగి ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఆ పార్టీ భారీ మెజార్టీతో మరోమారు అధికారంలోకి వచ్చిన సందర్భంగా జీవనభృతి అమలుకు అడ్డంకిగా మారిన ఆంక్షల సడలింపుకై వేలాది మంది బీడీ కార్మికులు ఎంతో ఆతృతతో ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలను సడలిస్తే 80వేల మందికి కొత్తగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. అయితే పీఎఫ్‌తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ బేషరతుగా జీవనభృతి అమలు చేయాలని తాము అభిలషిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.