తెలంగాణ

ప్రధాని మోదీ లీడర్.. మిగతా నేతలు డీలర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే లీడర్, మిగతా పార్టీల నేతలంతా డీలర్స్ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్ర అన్నారు. డీలర్స్ డీల్ చేస్తారు, లీడర్ ప్రజలను, దేశాన్ని లీడ్ చేస్తారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌తో కలిసి మాట్లాడుతూ అన్నారు. ఇప్పుడు దేశంలో మహా కూటమిలా డీలర్స్ ఒకవైపు, ప్రధాని మోదీ లీడర్‌లో మరోవైపు ఉన్నారని ఆయన తెలిపారు. ప్రధాని కుర్చీ అంటే మజాక్ కాదని, పవిత్ర బాధ్యత అని ఆయన చెప్పారు. దేశానికి దిశ, దశ నిర్ధేశించే శక్తి ప్రధాని మోదీకి ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, హత్యాకాండ ఆరంభమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో లీడర్, డీలర్స్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజాస్వామ్యం లేదంటూ విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు.