తెలంగాణ

ఎవరెన్ని నిధులు విడుదల చేశారో చర్చకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: దేశానికి స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తెలంగాణకు ఏ మేరకు నిధులు విడుదల చేసిందో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు గతంలో మీరు ప్రకటించిన విషయం వాస్తవం కాదా? అని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించడం భావ్యం కాదని ఆయన ఒక తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్కువ సమయంలో అనుమతి ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేసిందని ఆయన తెలిపారు. వివిధ పథకాలకు కేంద్రం నుంచి విడుదలైన నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.