తెలంగాణ

టీచర్ల కొరత తీర్చడానికి ఐమాక్స్ ప్రోగ్రాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: టీచర్ల కొరత తీర్చడానికి విద్యారంగంలో ఐమాక్స్ ప్రోగ్రాంను ప్రారంభించినట్టు ఎడ్‌టెక్ వ్యవస్థాపకుడు మండవ నవీన్ చెప్పారు. 2013లో ప్రారంభించిన ఈ విధానాన్ని అంచెలంచెలుగా వివిధ పాఠశాలల్లో అమలుచేస్తూ వచ్చామని, ప్రస్తుతం వెయ్యికి పైగా విద్యాసంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని అన్నారు. టీచర్ల కొరత ఎక్కువగా ఉన్న విద్యాసంస్థల్లో ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో ఐమాక్స్ ప్రోగ్రాంను అమలుచేస్తున్నట్టు ఆయన వివరించారు. ప్లాన్, టీచ్, అసెస్, రిమిడియేట్ దశల్లో ఐమాక్స్‌ను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నమూనాను హార్వర్డు బిజినెస్ స్కూల్ ప్రతిపాదించిందని, దానిని రాష్ట్రంలో గురుకులాల్లో కూడా అమలు చేస్తున్నట్టు తెలిపారు.