తెలంగాణ

మేడిగడ్డకు మహారాష్ట్ర హైడ్రాలజీ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: గోదావరి నదిపై మేడిగడ్డ దగ్గర తెలంగాణ ప్రభుత్వం నిర్మించే బ్యారేజీకి మహారాష్ట్ర ప్రభుత్వం హైడ్రాలజీ అనుమతులకు క్లియరెన్స్ ఇచ్చింది. మహారాష్ట్ర సిఇ సాహేబ్ తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలిపారు. ఈ అనుమతితో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కీలకమైన అంకం పూర్తయింది. మేడిగడ్డ అంతర్ రాష్ట్ర బ్యారేజీ. ఇది రెండు రాష్ట్రాల పరిధిలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన బ్యారేజీలు తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి మార్గం సుగమం అయింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అధికారికంగా ఒప్పందం కుదిరిన తరువాత ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతాయి. రెండు రాష్ట్రాల ఉన్నత స్థాయి సమావేశానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెలలోనే ఖరారు కావచ్చునని అధికార వర్గాల కథనం.