తెలంగాణ

వార్తా సంస్థలు నిష్పక్షపాతంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ, నిష్పక్షపాతంగా ఉండే వార్తా సంస్థలు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా స్యూస్ డిజిటల్ ఛానల్‌ను సురవరం సుధాకర్ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం ప్రసంగిస్తూ స్వతంత్రంగా వార్తలు, వ్యాఖ్యలు చేసే సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కొన్ని సంస్థలు ఏదో ప్రభుత్వాలకు బాకా ఊదుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా న్యూస్ ఛానల్ సీఇవో డాక్టర్ డి. సుధాకర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, సంగీత దర్శకుడు, ఏపీ సాంస్కృతిక, సాహిత్య అకాడమి చైర్మన్ వందేమాతరం శ్రీనివాస్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, , మాజీ ఎంపీ అజీజ్ పాషా, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్. బాలమల్లేష్, టి. శ్రీనివాస రావు, పార్టీ నాయకుడు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి, ప్రజా న్యూస్ ఎడిటర్ ఓంకార్ శ్రీకాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు.