తెలంగాణ

పారిశ్రామికవాడలకు పుష్కలంగా నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: రాష్ట్రంలో ఉన్న 59 ఇండస్ట్రియల్ క్లస్టర్లకు అవసరమైన నీటిని అందించాలని అధికారికంగా నిర్ణయించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి తెలిపారు. మిషన్ భగీరథ పనులపై సచివాలయంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తూ, పారిశ్రామిక వాడలకు నీటిని అందించేందుకు వీలుగా ఒక ప్రణాళికను రూపొందించి, లొకేషన్ల వారీగా, మ్యాపులతో సహా ఈ నెల 27 వరకు తనకు అందించాలని ఆదేశించారు.
టీఎస్‌ఐఐసీ ద్వారా ఫార్మాసిటీ, నిమ్జ్, టెక్స్‌టైల్‌పార్క్, మెడికల్ డివైసెస్ పార్క్, ఎంఎస్‌ఎంఈ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, చందన్‌వ్యాలీ ఇండస్ట్రియల్ పార్క్ తదితర పారిశ్రామిక క్లస్టర్లకు అవసరమైన నీటిని ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందుకోసం స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మిషన్ భగీరథ ద్వారా పారిశ్రామిక వాడల వరకు బల్క్‌గా నీటిని సరఫరా చేయాలని, పారిశ్రామిక వాడల్లో ఉండే పరిశ్రమలకు నీటిని అందించే బాధ్యత టీఎస్‌ఐఐసీ తీసుకోవాలని సూచించారు. వచ్చే 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి అవసరాలను అంచనావేయాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీటిని సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని మున్సిపాలిటీలకు, గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని ఇస్తున్నామన్నారు. కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని పంచాయతీల్లో అంతర్గత పైప్‌లైన్లు వేయాల్సి ఉందని, ఈ పనుల వేగంగా జరిగేలా పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాల శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు సమన్వయంగా పనిచేస్తూ, అనుమతి ఉన్న లేఅవుట్లకు తాగునీటిని సరఫరా చేయాలని జోషి సూచించారు. ఇప్పటికే గ్రామాల్లో సరఫరా అవుతున్న మంచినీటి సరఫరాపై కొన్ని గ్రామాల్లో శాంపిల్ చెక్ చేయాలన్నారు. ఈ సమావేశంలో సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి, నీటిపారుదల ఈఎన్‌సీ మురళీధర్‌రావు, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, మెట్రోవాటర్‌వర్క్స్ డైరెక్టర్ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..మిషన్ భగీరథపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ జోషీ