తెలంగాణ

రాజీనామా చేసి తెరాసలో చేరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 9: పార్టీలు మారే వారంతా తమ పదవులకు రాజీనామాలు చేయాలంటూ నిన్నటిదాకా అందరికీ నీతులు చెప్పిన ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా రేపు పార్టీ మారి టిఆర్‌ఎస్‌లో చేరితే ఎంపి పదవికి రాజీనామా చేయాలని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపి పదవికి రాజీనామా చేశాకే టిఆర్‌ఎస్‌లో చేరితేనే గుత్తా మాటలకు విలువ ఉంటుందని, లేకపోతే ప్రజలు ఆయనను క్షమించబోరన్నారు. ఏనాడూ గాంధీభవన్ మెట్లక్కని గుత్తాను కాంగ్రెస్ రెండు పర్యాయాలు ఎంపిగా చేసిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రతిపక్షాలను బలహీన పరుస్తోందని, ఆపరేషన్ ఆకర్ష్‌తో పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తుందంటూ విమర్శించిన గుత్తా నేడు అదే పార్టీలోకి వెళుతున్న తీరును ప్రజలు ఏమని అర్ధం చేసుకోవాలంటూ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.