తెలంగాణ

పార్లమెంట్ ఎన్నికల వరకూ జాబితా సరిచేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: పార్లమెంట్ ఎన్నికల వరకైనా ఓటర్ల జాబితా సరి చేసే పరిస్థితి కనిపించడం లేదని కాంగ్రెస్ ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల వరకు తొలగించిన ఓటర్లలో అర్హులైన వారిని చేరుస్తామని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. గాంధీభవన్‌లో బుధవారం కాంగ్రెస్ ఎన్నికల కో-ఆర్డినేషన్ కన్వీనర్ జీ నిరంజన్‌తో కలిసి శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 25న జరిగే ఓటర్స్ డే కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరిస్తోందని మర్రి శశిధర్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల కమీషన్ వైఫల్యాలను ఎండగడుతూ అఖిల పక్ష నేతలతో కలిసి గురువారం ధర్నా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈవీఎంలలో జరుగుతున్న అక్రమాలు, ఎన్నికల కమీషన్ తప్పిదాలను ప్రజలకు వివరిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నాయకులు కే జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, డీకే అరుణతో పాటు టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, ఎంబీటీ నాయకులు పాల్గొంటారని మర్రి శశిధర్‌రెడ్డి వివరించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై మర్రి తీవ్రంగా విరుచుకపడ్డారు. విమానాలు ట్యాంపరింగ్ జరిగితే ఎద్దుల బండిలో తిరుగుతారా? అని రజత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమని దుయ్యబట్టారు. అమెరికాలో బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు, మరి వారేమైనా ఎద్దుల బండిలో తిరుగుతున్నారా? అని మర్రి ధ్వజమెత్తారు. ఈవీఎంలను మొట్టమొదటగా ప్రవేశ పెట్టిన జపాన్‌లో కూడా బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా మటుకు బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఈవీఎంలపై వ్యక్తమైన అనుమానాల కారణంగానే వీవీ పాట్‌లను తీసుకొచ్చారన్నారు.