తెలంగాణ

గవర్నర్ ప్రసంగంలో ఈబీసీ ప్రస్తావన ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చేసిన ఉపన్యాసంలో ఈబీసీ 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి ప్రస్తావించకపోవడం దారుణమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈసారి 17 లోక్‌సభ స్థానాలకు ఒంటరిగానే పొటీ చేసి గెలుస్తామని అన్నారు. 1వ తేదీన హైదరాబాద్ పార్లమెంటు క్లస్టర్ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రజలు ఏ కూటమినీ నమ్మరని, ప్రజలు అభివృద్ధి కాముకులని అన్నారు. నరేంద్రమోదీ అభివృద్ధి వైపే ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో గెలిచిందా అని నిలదీశారు. కపిల్ సిబాల్ కాంగ్రెస్ మనిషేనని, ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం తమ వైఖరిని చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీగా మారిందని, తల్లి, కొడుకు, కూతురు పార్టీగా మారిందని బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు.