తెలంగాణ

ఆ హత్యలతో పార్టీకి సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: అమెరికాకు చెందిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా లండన్‌లో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో చేసిన ఆరోపణలను బీజేపీ నేత జీ కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని, ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిందని లండన్‌లో సయ్యద్ షుజా చేసిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో భాగంగానే ఈ ఆరోపణలను సయ్యద్ షుజా చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో స్క్రిప్ట్ తయారుచేసుకున్న కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ లండన్‌లో సయ్యద్ షుజాతో ఆరోపణలు చేయించారని అన్నారు.
సయ్యద్ షుజా ఎలా ఉంటారో, ఆయన ఎవరో, ఆయన ముఖం ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని, ఇంతటి దివాళాకోరు రాజకీయాలను తానెన్నడూ చూడలేదని కాంగ్రెస్‌ను ఉద్ధేశించి అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి తాను మాట్లాడేసరికి తన బృందంలోని 11 మంది సభ్యులు కనిపించకుండా పోయారని, వారంతా హత్యకు గురయ్యారని పరోక్షంగా బీజేపీపై సయ్యద్ షుజా ఆరోపించారు. అలాగే బీజేపీ రిగ్గింగ్ విషయం తెలిసిన గోపినాధ్ ముండే కూడా ఢిల్లీలో రోడ్డు ప్రమాదంలో మరణించడం అనుమానాస్పదమేనని సయ్యద్ షుజా చేసిన ఆరోపణలను కిషన్‌రెడ్డి ఖండించారు. హత్యలతో తమకు , తమ పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారంతా అదృశ్యమైనపుడు కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. భారతదేశానికి మచ్చ తెచ్చేలా సయ్యద్ మాట్లాడారని, ఈవీఎంలపై ఎవరికైనా అనుమానాలుంటే వాటిని సాక్ష్యాలతో బయటపెట్టవచ్చని పేర్కొన్నారు. కిషన్‌బాగ్‌లో మతకలహాలు సృష్టించి 11 మంది చనిపోయిన వాళ్లను ఆ ఖాతాలో వేసినట్టు ఆరోపించడం దారుణమని అన్నారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అపుడు తాను చంపితే ఆ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. సయ్యద్ షుజాకు అంతా తెలిస్తే తెలంగాణలో ట్యాంపరింగ్ జరగకుండా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఈవీఎంల వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించాలని, తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. కపిల్ సిబల్, సయ్యద్ షుజాలు చేసిన ఆరోపణలు వల్ల హైదరాబాద్‌లో ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దొంగ కతలు చెప్పే అలవాటు కాంగ్రెస్‌కే ఉందని, కపిల్ సిబల్ ఢిల్లీ నుండి లండన్ ఎందుకు వెళ్లారని నిలదీశారు.
డీజీపీకి ఫిర్యాదు
కపిల్ సిబల్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు బీజేపీ నేత ఎన్ రామచందర్‌రావు చెప్పారు. రాజకీయ దురుద్ధేశ్యంతో కుట్ర పూరితంగా కిషన్‌రెడ్డిపై ఆరోపణలు చేశారని అన్నారు. కిషన్ రెడ్డి ప్రతిష్టనూ, బీజేపీ ప్రతిష్టనూ దెబ్బతీయాలనేదే వారి ఆలోచనగా ఉందని, సమాజంలో కిషన్‌రెడ్డికి ఉన్న ప్రతిష్ట మసకబారాలని చూస్తున్నారని, సయ్యద్‌పైనా, కపిల్ సిబల్‌పైనా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరారు.