తెలంగాణ

యాదగిరిగుట్టలో మోడల్ బస్‌స్టేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: యాదగిరిగుట్టలో మోడల్ బస్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి సంబంధిత అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) సమావేశం సచివాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, యాదిగిరిగుట్ట బస్‌స్టేషన్ నిర్మాణానికి కాలపరిమితి విధించుకుని పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. పెద్దగుట్టలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని 2019 ఏప్రిల్ 15 వరకు పూర్తి చేయాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. యాదగిరిగుట్టను మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేసేందుకు రోడ్లఇరువైపులా మొక్కల పెంపకం భారీ ఎత్తున చేపట్టాలని, స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, పార్కులను అభివృద్ధి చేయాలని, మార్కెట్లు, జంక్షన్ల అభివృద్ది, రోడ్లు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం శాస్ర్తియ విధానంలో ఉండాలన్నారు. పట్టణానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలన్నారు. గుట్టలో కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫైర్‌స్టేషన్, రోడ్ల వెడల్పు, గండిచెరువుఅభివృద్ది, తాగునీటి సరఫరా సమర్థతగా ఉండాలన్నారు. వేదపాఠశాల, శ్రీ లక్ష్మీనర్సింహ స్కల్‌ప్చర్, ఆర్కిటెక్చర్ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటు తదితర అంశాలపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైటీడీఏ వైస్-చైర్మన్ కిషన్‌రావు, రోడ్లుభవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, ఇంచార్జీ కమిషనర్ అనిల్ కుమార్, యాదాద్రి కలెక్టర్ అనితారామచంద్రన్, యాదాద్రి ఆలయం ఈఓ గీత తదితర అధికారులు పాల్గొన్నారు.