తెలంగాణ

నిజామాబాద్ జైలులో జీవిత ఖైదీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, జూన్ 9: కట్టుకున్న భార్యను హత్య చేసిన కేసులో నిజామాబాద్ జిల్లా కారాగారంలో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న రఫీక్ అనే వ్యక్తి గురువారం మృతి చెందినట్లు రూరల్ ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దోమకొండ మండలానికి చెందిన రఫీక్ అనే వ్యక్తికి భార్యను హత్య చేసిన కేసులో 2010లో న్యాయస్థానం జీవితఖైదు శిక్షను విధించింది. ఇందులో భాగంగా జిల్లా కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న రఫీక్ గురువారం ఉదయం జిల్లా జైలులో వాటర్ ట్యాంక్‌ను శుభ్రపరుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారిపడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఆర్డీఓ యాదిరెడ్డి సమక్షంలో శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.