తెలంగాణ

జూపల్లి కాన్వాయ్‌ని అడ్డుకున్న ఓయు జెఎసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 9: టిజెఎసి చైర్మన్ కోదండరాంపై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ జెఎసి విద్యార్థులు భగ్గుమన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం బోగారం గ్రామంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి మంత్రి జూపల్లి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓయూ జెఎసి విద్యార్థులు కొందరు భోగారం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోకి మంత్రి కాన్వాయ్ రాగానే విద్యార్థులు ఫ్లకార్డులు ప్రదర్శించి టిజెఎసి చైర్మన్ కోదండరాంపై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, వారు క్షమాపణ చెప్పాలంటూ నిరసనకు దిగారు. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని నిరసన తెలుపుతున్న నేపథ్యంలో పోలీసులు వెంటనే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ జెఎసి నాయకులు రెడ్డి శ్రీనివాస్, కృష్ణతో పాటు మరికొందరిని కోస్గి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తమను అరెస్టు చేయడం తగదని, ప్రభుత్వం ఉద్యమకారులను అణచివేయడానికి, ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించిన వారిని విస్మరిస్తోందని ఓయూ జెసి నాయకులు రెడ్డి శ్రీనివాస్, కృష్ణ ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు కోదండరాంకు క్షమాపణ చెప్పినంత వరకు మంత్రులను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. అయితే ఓయూ జెఎసి విద్యార్థులు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో నిరసన తెలపడంతో తెరాస నాయకులు ఖంగుతిన్నారు.