తెలంగాణ

అసమర్థుడి చేతిలో సిఎం పదవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 9: దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండి, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఒక అసమర్ధుడి చేతిలో ముఖ్యమంత్రి పదవి పెట్టినట్లయిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెండేళ్ల పాలనపై ఆయన మండిపడ్డారు. సిఎం పాలన కొత్త సీసాలో పాత సారాలా ఉందని ఆయన విమర్శించారు. గత రెండేళ్లుగా ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఫాంహౌస్‌కే పరిమితమై సచివాలయానికి రాకపోవడంతో ఎక్కడి ఫైల్‌లు అక్కడే మూలుగుతున్నాయన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ అని నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇచ్చిన మాటను తుంగలో తొక్కి రైతాంగాన్ని దగా చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్లలోనే ఇప్పటివరకు మూడువేల రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వ పనితీరు సరి చేసుకోవాలని చెప్పినందుకు పొలిటికల్ జెఏసి చైర్మన్ కోదండరాంపై మంత్రులు ముప్పేట దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఏర్పాటైనా పాలనలో కొత్త దనమేమి లేదన్నారు. పైగా కొత్త జిల్లాల పేరుతో ముఖ్యమంత్రి కెసిఆర్ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపి నామనాగేశ్వర్‌రావు మాట్లాడుతూ భూసేకరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

chitram వరంగల్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ