తెలంగాణ

బిజెపితోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 10: కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బిజెపితోనే అభివృద్ధి తెలంగాణ సాధ్యమని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఎక్కడ కుటుంబ పాలన ఉన్నా అక్కడ అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’లో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లా, సూర్యాపేటలో నిర్వహించిన సభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై ధ్వజమెత్తారు. రెండేళ్ళలో ఏమి చేశారంటూ సోనియా గాంధీ ప్రశ్నించినట్లు తాను టివీలో చూశానని పేర్కొన్న ఆయన రెండేళ్ళలో ఏమి చేశామో చెప్పేందుకు, ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కానీ ‘మీరు 60 ఏళ్ళలో ఏమి చేశారో ప్రజల ముందు పెట్టగలరా?’ అని ఆయన ప్రశ్నించారు. తాము ప్రజలతో మాట్లాడే, మమేకమయ్యే ప్రధానిని ఇచ్చామని, మీ (యుపిఎ) హయాంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కేవలం మీకు (సోనియా), రాహుల్ గాంధీకే పరిమితమయ్యేవారని అంటూ మన్మోహన్‌ను ‘వౌని బాబా’గా ఆయన విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ళలో ఒక్క కుంభకోణం జరగలేదని ఆయన చెప్పారు.
రాహుల్ బాబాకు
ఇటాలియన్ కళ్ళ జోడు
ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన రాహుల్ బాబాగా అభివర్ణించారు. దేశ సరిహద్దుల్లో యుపిఎ హయాంలో కాల్పులు జరిగేవని ఇప్పుడూ జరుగుతున్నాయని రాహుల్ అన్నారని ఆయన చెబుతూ రాహుల్ బాబా ఇటాలియన్ కళ్ళ జోడు పెట్టుకున్నందున వాస్తవాలు కనిపించడం లేదని విమర్శించారు. పాక్ తుపాకులతో కాల్పులు జరిపితే తమ సైన్యం ఫిరంగి గుళ్లతో సమాధానం చెబుతోందన్నారు.
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి, బలోపేతం కావాలంటే అది బిజెపితోనే సాధ్యమని అన్నారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మతవ్ఢ్యౌనికి ముఖ్యమంత్రి కెసిఆర్ జవాబు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం విడుదల చేస్తున్న వేల కోట్ల రూపాయలు గ్రామాలకు వెళ్ళడం లేదని విమర్శించారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నెం.1గా నిలవాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన చెప్పారు. అమిత్‌షా హిందీలో చేసిన ప్రసంగాన్ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలుగులోకి తర్జుమా చేశారు.

చిత్రం... సూర్యాపేట బహిరంగ సభలో మాట్లాడుతున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. హాజరైన జనం