తెలంగాణ

హైదరాబాద్ ఔషధ నగరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీకి హైదరాబాద్ ఫార్మాసిటీ అని పేరు పెట్టింది. ఫార్మా సిటీ ఏర్పాటుకు పరిశ్రమల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ భూమి లభ్యతనుబట్టి ఫార్మా సిటీ సరిగ్గా ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారో ప్రకటిస్తారు. 12,500 ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది నుంచి ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ ఫార్మా కంపెనీలు ఇక్కడ తమతమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించారు. తాము సేకరించే స్థలానికిమించి దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. పలు జాతీయ అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ ఫార్మా సిటీలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.
తెలంగాణ మొదటి నుంచి బల్క్ డ్రగ్స్ తయారీ కేంద్రంగా ఉంది. ఫార్మా కంపెనీలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా ఫార్మా సిటీ నిర్మించేందుకు ప్రభుత్వం చాలాకాలంగా యోచిస్తోంది. ఈ నిర్ణయంలో భాగంగానే హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటు జరిగింది. బల్క్ డ్రగ్స్‌తోపాటు డ్రగ్స్‌కు సంబంధించి పరిశోధనలకు సైతం ఇది కేంద్రంగా మారనుంది. సెంట్రలైజ్‌డ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సైతం ఫార్మా సిటీలో ఏర్పాటు చేస్తారు. దీంతో ఒక్కో యూనిట్ విడివిడిగా ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయకుండా ఉమ్మడిగా ఉపయోగించే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు గత ఏడాది నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సరిగ్గా ఏడాది క్రితం మే 11, 2016న ఫార్మా సిటీకి సంబంధించి జీవో జారీ అయ్యింది. ఫార్మా సిటీలో ఫార్మా కంపెనీలకు సంబంధించి సర్ట్ఫికేషన్, టెస్టింగ్ సౌకర్యాల కూడా ఉంటాయి. ఫార్మా కంపెనీల కార్యాలయాలు, ల్యాబ్స్‌ను అభివృద్ధి చేస్తారు. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఫార్మా సిటీలో నేషనల్ ఇనె్వస్టిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు కేంద్రం ఆమోదం తెలిపింది. నిమ్జ్ అనుమతితో హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్రం నుంచి వౌలిక సదుపాయాల కల్పనకు సహాయం లభిస్తుంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఫార్మాసిటీ కోసం సేకరిస్తారు.