తెలంగాణ

కంచ ఐలయ్యపై చర్య తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: కంచ ఐలయ్య షెపర్డ్ బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ, బాధ్యతారాహిత్యంగా ప్రపంచానికే గర్వకారణమైన హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నందున, తక్షణమే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మిన్ యూనిటీ ఫరెవర్, బ్రాహ్మణ సంఘ నేతలు తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మను కోరారు. ఈ మేరకు ద్రోణంరాజు రవికుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు. హిందూ సంస్కృతిని పరిరక్షిస్తున్న బ్రాహ్మణుల మనోభావాలను ఐలయ్య దెబ్బతీస్తూ, అవమానిస్తున్నారని ఇది చట్టపరమైన నేరమేనని వారు స్పష్టం చేశారు.
ఐలయ్య సమాజానికి ఎందుకూ పనికిరాని మేధోసంపత్తినంతా ఉపయోగిస్తూ, మీడియాలో ఇష్టారీతిన మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఐలయ్య ప్రవర్తనలో మార్పు రాకపోతే కుల మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య వ్యాఖ్యలకు సంబంధించిన మీడియా క్లిప్పింగులను డిజిపికి అందచేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని డిజిపి హామీ ఇచ్చారు. డిజిపిని కలిసిన వారిలో ఆలూరి, జి.కృష్ణమోహన్, ఆనంద్‌మోహన్, మల్లాది చంద్రవౌళి, రమణ తదితరులున్నారు.

కంచ ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డిజిపి
అనురాగ్‌శర్మను కలసి వినతిపత్రం సమర్పిస్తున్న బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు