తెలంగాణ

మెస్ చార్జీలు ఇవ్వకపోతే భోజనం ఎలా పెడతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: రాష్ట్రంలోని 2245 ఎస్‌సి/ఎస్‌టి/బిసి వసతి గృహాల్లో నివసరించే 2.92 లక్షల మంది విద్యార్థుల భోజన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలలుగా విడుదల చేయడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. బడ్జెట్ విడుదల చేయకపోతే వసతి గృహాల్లోని విద్యార్థులకు భోజనం ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. ఆర్.కృష్ణయ్య బుధవారం ఆర్థిక శాఖ కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. వసతి గృహాల్లోని వార్డెన్లు వడ్డీలకు డబ్బులు తెచ్చి వసతి గృహాలు నడిపిస్తున్నారని ఆయన తెలిపారు. కాబట్టి వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వసతి గృహాలు మూసి వేసే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. ప్రైవేటు భవనాల్లో ఉన్న వసతి గృహాలకు అద్దె చెల్లించేందుకూ బడ్జెట్ విడుదల చేయలేదని చెప్పారు. ఇంకా వసతి గృహాల విద్యుత్తు బిల్లుల బకాయిలు గత ఏడాదిగా చెల్లించడం లేదని, దీంతో 8 కోట్ల రూపాయలు బకాయిలు పేరకుపోయాయని కృష్ణయ్య తెలిపారు.