తెలంగాణ

అనుమతి లేని వృద్ధాశ్రమాలకు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ప్రభుత్వ అనుమతి లేకుండా వృద్ధాశ్రమాలను నిర్వహిస్తే చర్యలు తప్పవని దివ్యాంగ, మహిళా, శిశు, వృద్ధుల సంక్షేమశాఖ డైరక్టర్ హెచ్చరించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయో గోప్యంగా ఉంచుతున్నాయని పేర్కొన్నారు. వృద్ధాశ్రమాలను నిర్వహించే సంస్థలు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వివరాలతో పాటు తమ శాఖలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా వృద్ధాశ్రమాలను నిర్వహించే సంస్థలకు రూ. 25 వేల జరిమానా విధిస్తామని డైరెక్టర్ హెచ్చరించారు.