తెలంగాణ

పదోన్నతులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: దశాబ్దాలుగా నానుతూ కొలిక్కి వచ్చిందని భావిస్తున్న పండిత, పీఈటీల అప్‌గ్రేడేషన్‌లతో ఎస్‌జీటీలకు తీరని అన్యాయం జరగనుందని సెకండరీ గ్రేడ్ తెలంగాణ టీచర్ల సంఘం అధ్యక్షుడు సంకినేని మధుసూధనరావు, ప్రధానకార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డిలు పేర్కొన్నారు. కేడర్‌లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని వారు చెప్పారు. జీవో 11, 12లో పేర్కొన్న మేరకు అర్హులైన వారికి పదోన్నతుల్లో మొండిచేయి ఎదురుకాబోతోందని ఇన్ని అసంబద్ధతల మధ్య శాసనమండలి ఎన్నికల ముందు హడావుడిగా పదోన్నతుల తంతు ఏ ప్రయోజనం కొరకో అర్ధం కావడం లేదని వారు పేర్కొన్నారు. 20 సంవత్సరాలకు పైగా సర్వీసు ఉన్న ఎస్‌జీటీలు ఆరేళ్ల సర్వీసు ఉన్న వారి కన్నా వెనుకపడిపోయే ప్రమాదం ఉందని ఆ తర్వాత వారు పదోన్నతిని నోచుకోని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
ఎన్‌సీటీఈ మార్గదర్శకాల మేరకు అర్హతలున్న వారికి పదోన్నతి కల్పించాలనే ప్రాధమిక సూత్రం గంగపాలు కాబోతోందని చెప్పారు. పోరాటాల పోరుబిడ్డలుగా అభివర్ణించుకునే సంఘాలు తమ జండాలు మోస్తున్న ఎస్‌జీటీలకు జరగుతున్న అన్యాయాన్ని అడ్డుకోకుండా చోద్యం చూడటం విడ్డూరమని అన్నారు. ఎంఎల్‌సీ ఓటు హక్కు లేకపోవడమే ఎస్‌జీటీల పాలిట శాపంగా పరిణమించిందని అప్‌గ్రేడేషన్ పోరుతో పదోన్నతులు ఇవ్వడాన్ని ఎస్‌జీటీయూ స్వాగతిస్తోందని అన్నారు. కానీ తద్వారా ఎస్‌జీటీలకు జరగబోయే ప్రస్తుత, భవిష్యత్ అన్యాయాల దృష్ట్యా సాధారణ పదోన్నతులు ఇచ్చిన తర్వాతనే అప్‌గ్రేడేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అలాగే కేడర్‌లో పాటించాల్సిన రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించి సామాజిక న్యాయాన్ని తద్వారా రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు.