తెలంగాణ

మోదీ, కేసీఆర్‌ది రాచరిక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల పాలన రాచరిక పాలనను తలపిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి దుయ్యబట్టారు. మంత్రిమండలి లేకపోవడం వల్ల రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని విమర్శించారు. గాంధీభవన్‌లో బుధవారం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికైనా మంత్రివర్గాన్ని విస్తరించి పాలనను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలన స్తంభించడంతో ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించక కనెక్షన్ కట్ చేసిన ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పాలన స్థంభించడంతో పరిస్థితి దారుణంగా మారిందని, సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలో ధిక్కుతోచని స్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రంలో మోదీ పాలన సాగుతోందని విమర్శించారు.
సీబీఐ, ఈడీ, వంటి రాజ్యాంగ వ్యవస్థలను కూడా ఎన్డీయే సర్కార్ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కోల్‌కత్తాలో జరిగిన ఘటన రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పరిస్థితి చెయ్యిదాట లేదన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పడు కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదన్నారు. కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకునే విధంగా పని చేయాలన్నారు.