తెలంగాణ

సేవా దృక్పథమే నేతలకు శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 6: రాజకీయ నాయకులు సేవా దృక్పథంతో ఉండాలని, గెలుపు కోసం ఓటర్లను ప్రలోభపెట్టడం, అనంతరం అక్రమ మార్గాలను అనే్వషించడం సరికాదని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి కె వెంకటేశ్వర్లు అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 90 శాతానికి పైగా ఓటుహక్కు వినియోగించుకోవడం, ప్రధానంగా మహిళలు అధికంగా ఓటు వేయడంపై అధ్యయనం చేసేందుకు బుధవారం ఆయన ఖమ్మం వచ్చారు.
స్వయం సహాయక మహిళా సంఘాలు, దివ్యాంగులతో ప్రత్యేకంగా సమావేశమై ఓటు వేసేందుకు అధికారులు తీసుకున్న చర్యలు, ఓటు వేసేందుకు కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా కొందరు గ్రామీణ ప్రాంతవాసులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా కొందరిని ‘ప్రలోభాలకు లొంగి ఓటు ఎలా వేశారు?’ అని ప్రశ్నించగా రాజకీయ నాయకులు డబ్బు ఇస్తున్నప్పుడు తీసుకోవడంలో తప్పేమిటని వారు ఎదురుప్రశ్నించారు.
అనంతరం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ కర్ణన్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, అలాంటి ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటర్లపై ధనం, మద్యం విపరీతంగా ప్రభావం చూపడం చాలా దురదృష్టకరమన్నారు.
డబ్బుతో గెలిచే నాయకులకు నైతిక విలువలు ఉంటాయా అనే సందేహం ప్రజల్లో రావాలన్నారు. న్యాయం, సేవాభావం, సమానత్వం వంటి నైతిక సూత్రాలను రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. రాజకీయ నేతలు ప్రజాస్వామ్యాన్ని కౌలుస్వామ్యంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణత్యాగం చేసిన నాయకుల స్ఫూర్తితో రాజకీయ పార్టీలు నైతికతతో పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. అధికార యంత్రాంగం ఎంతగా శ్రమించినప్పటికీ ఓటు అనే వజ్రాయుధాన్ని సక్రమంగా వినియోగించక పోవటం ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ అవుతుందన్నారు. ఓటుహక్కుపై మరింత అవగాహన కల్పించి ప్రజలు డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకుండా నైతికతతో ఓటుహక్కు వినియోగించుకునేలా మరింత కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వెంకటేశ్వర్లు హితవు పలికారు.
చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు