తెలంగాణ

డిగ్రీలో ప్రవేశానికి ఆన్‌లైన్ సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో అన్ని కోర్సుల్లో ఒకే దరఖాస్తుతో చేరేందుకు ఆన్‌లైన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు 74 హెల్ప్‌లైన్ కేంద్రాల కోఆర్డినేటర్లు, కాలేజీల ప్రిన్సిపాల్స్ ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరాల్లో ఎదురైన ఇబ్బందులు, సమస్యలు పునరావృత్తం కాకుండా ఈ ఏడాది మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని, విద్యార్థులు ఎంతో తేలికగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. ఈసారి అడ్మిషన్ల ప్రక్రియను స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేస్తామని, దీర్ఘకాలికంగా చేయడం వల్ల కొత్త కొత్త సమస్యలు ఎదురయ్యాయని అన్నారు. తుది దశ వరకూ మొత్తం వ్యవహారాలు అన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతాయని, కాలేజీలకు వెళ్లి ఎవరూ సంప్రదించాల్సిన పనే్లదని, వారి సొంత మొబైల్‌కు, ఇమెయిల్‌కు సమాచారం నేరుగా దోస్త్ కార్యాలయం నుండి వస్తుందని వివరించారు. సీబీఎస్‌ఈ ఫలితాల వల్ల జాప్యం జరుగకుండా నేరుగా ఆ డాటాను తీసుకోవడం వల్ల కొంత సమయాన్ని ఆదా చేయవచ్చనే ఆలోచన వచ్చిందని అన్నారు. అలాగే ఈసారి హెల్ప్‌లైన్ సెంటర్లలో ఆధార్ రీడర్లతో ఆధునీకరిస్తున్నామని అన్నారు. ఇంటర్ ఫలితాలు రాగానే దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు.
ఆరో రోజు 58,126 మందికి ప్రాక్టికల్స్
* రాష్ట్రంలో 671 కేంద్రాల ఏర్పాటు
ఆరో రోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి రాష్టవ్య్రాప్తంగా 58,126 మందికి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించినట్టు బోర్డు కార్యదర్శి ఎ అశోక్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో 671 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

చిత్రం.. ఉన్నత విద్యామండలిలో నిర్వహించిన డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ - దోస్త్ తొలి సమావేశంలో పాల్గొన్న డిగ్రీ కళాశాలల కో-ఆర్డినేటర్లు, హెల్ప్‌లైన్ సెంటర్‌ల కో-ఆర్డినేటర్లు