తెలంగాణ

మిరప తోటల్లో ఆదివాసీ కూలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 6: మిరపకాయలు కోతకు వచ్చిన తరుణమిది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు మిరప సాగుచేశారు. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి పంట కోయాల్సి ఉండటంతో రైతులకు కూలీల సమస్య ఇబ్బందికరంగా మారింది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చేసేందుకు పనుల్లేక నిరుపేద ఆదివాసీ కుటుంబాలు ఇటువైపు వలస బాట పడుతున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు వేల సంఖ్యలో ఆదివాసీ నిరుపేదలు చేరుకున్నారు. వలస కూలీలకు మిరపకాయలు కోత పనులు జీవనాధాంగా మారాయి. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల గోదావరి పరీవాహక ప్రాంతంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, చండ్రుగొండ, టేకులపల్లి, ములకలపల్లి, ఇల్లందు, ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కారేపల్లి, మధిర, వైరా తదితర మండలాలు, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మిరప తోటల్లోనే ఆదివాసీలు గుడారాలు వేసుకుని నివాసముంటున్నారు. వీరి జీవనం కోసం అవసరమైన వసతులను రైతులు కల్పిస్తూ మిరప కోతకు కూలీల అవసరాన్ని తీర్చుకుంటున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు వంటి నిత్యావసర సరుకులను కూలీలకు అందిస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సౌకర్యం ఉండటంతో వెలుతురు కోసం ప్రత్యేకంగా దీపాలు, నీటి వసతి కల్పిస్తున్నారు. గ్రామాలకు వందల సంఖ్యలో వలస కూలీలు ఆకలి తీర్చుకునేందుకు తరలి వస్తున్నారు. పొద్దుపొడిచింది మొదలు పొద్దుకూకేంత వరకు మిరపతోటల్లోనే ఉంటూ కాయలు కోయటం, కల్లాల్లో ఆరిబోసిన మిరప కాయలను గ్రేడిండ్ చేయటం వంటి పనులు చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కూలి ఇస్తుండటంతో తమ కష్టానికి తగిన ఫలితం దక్కుతోందని ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.