తెలంగాణ

కేటీపీపీ రెండో దశలో విరిగిన స్టీమ్‌లైన్ గేట్‌వాల్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి (గణపురం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలోనున్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం రెండవ దశలో మరో సారి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 50 రోజుల సుదీర్ఘ వార్షిక మరమ్మతుల అనంతరం ఈ నెల 5వ తేదీన లైటాఫ్ ప్రారంభించారు. ప్లాంటు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే బ్రాయిలర్ నుంచి వచ్చే స్టీమ్‌లైన్ గేట్‌వాల్వ్ రెండు చోట్ల విరిగిపోవడంతో ప్లాంటును నిలిపివేశారు. ఇప్పటికే రెండవ దశ రోటార్ పగిలి పోయిన విషయం తెలిసిందే సుమారు 35 కోట్లు వెచ్చించి జెన్‌కో యాజమాన్యం కొత్త రోటార్‌ను బిగించారు. 50 రోజుల పాటు కొనసాగిన వార్షిక, మరమ్మతుల్లో లోపాలు ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడ్డట్లు సమాచారం ఇప్పటికే సుమారు 50 కోట్లకు పైగా కేటీపీపీ వల్ల జెన్‌కో యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లింది. కేటీపీపీ సీఈతో కింది స్థాయి ఉద్యోగులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్లాంటుకు శాపంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన ఐదేళ్ళ కాలంలో కేటీపీపీ ఈ స్థాయిలో వైఫల్యం చెందలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి, వివిధ విభాగాల అధికారుల మధ్య వార్షిక మరమ్మతుల సమయంలో అవగాహన లేకపోవడం వల్లే స్టీమ్‌లైన్ గేట్‌వాల్ విరిగిపోయిందనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి. నిలిచిపోయిన రెండవ దశ విద్యుత్ ప్లాంట్ మరో రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చిత్రం.. కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం