తెలంగాణ

కెస్లాపూర్‌లో నేడు నాగోబా గిరి దర్బార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,్ఫబ్రవరి 6: ఆదివాసీల సంస్కృతి, వారసత్వ సంపదకు ప్రతిరూపంగా నిలిచే కెస్లాపూర్ నాగోబా జాతర భక్తుల సందడితో కిట కిటలాడింది. బుధవారం మూడో రోజు జాతరకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి చేరుకున్న మెస్రం వంశస్థులు నాగోబాకు మొక్కులు చెల్లించుకొని తన్మయత్వానికి గురయ్యారు. మర్రిచెట్ల నీడన సాంప్రదాయ నైవేద్యాలు, కొత్త కోడళ్ళ బేటింగ్‌లు, ఆనాదిగా వస్తున్న ఆచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో నాగోబా ప్రాంగణం పులకించిపోయింది.
ఒకేచోట బస చేసిన మెస్రం వంశస్థులు ఆత్మీయ పలకరింపులు, కుశల ప్రశ్నలతో ముచ్చట్లతో గడిపారు. గోవాడ వద్ద పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు బుధవారం నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం కలెక్టర్ దివ్య గురువారం నిర్వహించే దర్బార్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
అమాత్యులు లేకుండా గిరి దర్బార్
కెస్లాపూర్ నాగోబా జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించడంతో సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద గిరిజన ఉత్సవంగా నాగోబా జాతరను నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం భక్తులకు తాగునీరు, భోజన వసతి, ఇతర కనీస వసతులు కల్పించగా ప్రభుత్వ శాఖల పనితీరుపై ప్రత్యేకంగా స్టాళ్ళను ఏర్పాటుచేశారు. అయితే జాతర ఉత్సవంలో అత్యంత ప్రధానంగా భావించే గిరి దర్బార్ గురువారం నిర్వహించాలని నిర్ణయించారు. భారీ సంఖ్యలో గిరిజనులు హాజరయ్యే దర్బార్ కోసం ఏర్పాట్లు గావించారు. 1946లో కెస్లాపూర్ జాతరను సందర్శించిన మానవ పరిణామ శాస్తవ్రేత్త హెమన్‌డార్ప్ సూచన మేరకే అప్పటి నిజాం ప్రభుత్వం గిరిజనుల సమస్యల పరిష్కార వేదిక కోసం ప్రత్యేకంగా దర్బార్‌ను ప్రారంభించింది. గిరిజనుల చెంతకు అధికారులు, ప్రజా ప్రతినిధులే వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని అప్పటి ప్రభుత్వం సూచించడంతో ఇప్పటి వరకు యదావిధిగా 72 ఏళ్ళ నుండి గిరి దర్బార్ కొనసాగుతోంది. మంత్రులు, శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరవుతూ వస్తూండగా ఈ సారి మాత్రం మంత్రి వర్గ విస్తరణ లేకపోవడంతో అమాత్యులు లేకుండానే దర్బార్ సాగనుంది. కెస్లాపూర్‌లో ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణం కోసం రెండు కోట్ల నిధులతో పనులు కొనసాగుతుండగా 1.5 కోట్ల వ్యయంతో దర్బార్ సభావేదిక ఏర్పాట్లు సాగుతున్నాయి. విశ్రాంతి భవన నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయి. కెస్లాపూర్ నుండి ఆలయం వరకు రూ.66 లక్షలతో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టగా మల్లాపూర్ నుండి నాగోబా ఆలయం వరకు రూ.84లక్షల వ్యయంతో బీటి రోడ్డు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. గురువారం జరిగే దర్బార్‌తో పాటు జాతర ఉత్సవాల నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుదినం వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు.
చిత్రం.. గిరి దర్బార్‌కు సిద్ధమైన సభావేదిక, జాతరకు వస్తున్న గిరిజనం