తెలంగాణ

అన్ని జిల్లాల్లో ఆదర్శ సమీకృత మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 6 : అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు కాదని.. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ఆరోగ్యకరమైన పరిస్థితులు, వసతులు రావాలని మాజీ మార్కెటింగ్ శాఖ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. అన్నీ ఒకేచోట దొరకాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే తన తాపత్రయం అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆదర్శ సమీకృత మార్కెట్‌ను రూ. 20 కోట్లతో అన్ని హంగులతో నిర్మించినట్లు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేటలో సమీకృత మోడల్‌ను మార్కెట్‌ను మాజీ మంత్రి హరీష్‌రావు ప్రారంభించిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలో మోడల్ సమీకృత మార్కెట్లు నిర్మించేందుకు తెలంగాణ సర్కార్ కృషిచేస్తోందన్నారు. ఇప్పటికే గజ్వేల్, సూర్యాపేట ప్రాంతంలో సమీకృత మార్కెట్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. సిద్దిపేట పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూలు, చేపలు, మాంసం అన్ని ఒకే చోట లభించేలా ఆధునిక మార్కెట్‌ను నిర్మించినట్లు పేర్కొన్నారు. సమీకృత మార్కెట్‌లోనే నిత్యావస సరుకుల కోసం సూపర్‌మార్కెట్, బంకెట్ హాల్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట మార్కెట్‌లో కూరగాయలు, మాంసం, చేపలు అమ్ముకునేందుకు వ్యాపారులకు సరైన సదుపాయాలు లేకపోవటం వల్ల రోడ్లపైన విక్రయించేవారన్నారు. దీంతో వినియోగదారులు ఏన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా మార్కెటింగ్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ప్రతి వస్తువు ఇక్కడే దొరికేలా, ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించేలా ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మొదట్లో కొంత ఇబ్బందైనా నాలుగురోజులైతే ఈ సమీకృత మార్కెట్ అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ఇప్పటికే పట్టణంలో మోడల్ రైతుబజార్, ఎన్జీఓ కాలనీ, కాళ్లకుంట కాలనీ, హౌజింగ్‌బోర్డు కాలనీల్లో రైతుబజార్‌లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 4 కోట్ల రూపాయలతో స్లాటర్‌హౌస్‌ను నిర్మించి అందుబాటులో తేనున్నట్లు పేర్కొన్నారు. కబేళాలలో మున్సిపల్ అధికారులు పరీక్షలు నిర్వహించిన తర్వాత మాంసం విక్రయిస్తే ప్రజలకు నాణ్యమైన మాంసం దొరుకుతుందద్నారు. మోడల్ మార్కెట్‌లో కూరగాయల కోసం 108 స్టాల్స్, మాంసం వ్యాపారులకు 72 స్టాల్స్, చేపల వ్యాపారలకు 25 స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా కార్లు, ట్రక్కులు, లారీలకు చక్కని పార్కింగ్ ఉండేలా 2 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మోడల్ రైతుబజార్‌లో రోజూ రూ.10 లక్షల వ్యాపారం
సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మోడల్ రైతుబజార్‌లో 600 మంది రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారని, రోజుకు 9నుంచి 10లక్షల వ్యాపారం జరుగుతుందని హరీష్‌రావు అన్నారు. నాడు రైతుబజార్ నిర్మాణం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు మంచి ఫలితం వచ్చిందని, మోడల్ రైతుబజార్‌గా రూపుదిద్దుకున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగించటం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయన్నారు. ప్రజలందరి సహకారంతో పరిశుభ్రమైన పట్టణంగా రూపుదిద్దుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్‌లో సిద్దిపేట మున్సిపాల్టీని క్లీన్ అండ్ గ్రీన్ సిద్దిపేటగా మార్చేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆనందమే మన ఆనందమని, అందరి సహకారంతోనే అది సాధ్యమవుతుందన్నారు. ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌ను వినియోగంలోకి తెచ్చి ఆదర్శంగా నిలపటంలో ప్రజలు బాధ్యతగా కృషిచేయాలని సూచించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌ను ప్రారంభించుకోవటం సంతోషకరమన్నారు. కొత్త దనానికి ఏదైన సిద్దిపేట నాంది పలుకుతుందన్నారు. జేసీ పద్మాకర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఈలాంటి మార్కెట్లునిర్మాణం జరుగలేదని, హరీష్‌రావు కృషి వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే సిద్దిపట ప్రజలు అదృష్టవంతులన్నారు. అడీషనల్ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక హంగులతో ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌ను నిర్మించినట్లు పేర్కొన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ నందిని శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.
ఆనంతరం మార్కెట్ కమిటీ పక్షాన ఎమ్మెల్యే హరీష్‌రావును ఘనంగా సన్మానించగా, పాలక వర్గాన్ని హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు సన్మానించారు. కలెక్టర్ కృష్ణ్భాస్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జడ్పీవైస్ చైర్మన్ సారయ్య, కౌన్సిలర్లు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, ప్రశాంత్ పాల్గొన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీష్‌రావు