తెలంగాణ

మే 28 నుండి తెలంగాణ పీజీ ఈసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: తెలంగాణలో పీజీఈసెట్‌ను మే 28వ తేదీ నుండి మే 31వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. పరీక్ష ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకూ, మధ్యాహ్నం సెషన్‌లో 2 గంటల నుండి ఐదు గంటల వరకూ జరుగుతుంది.రాష్ట్రంలో హైదరాబాద్‌లోనూ, వరంగల్‌లోనూ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మార్చి 13 నుండి మొదలవుతుంది. దరఖాస్తులను సమర్పించేందుకు ఏప్రిల్ 30 చివరి తేదీ, దరఖాస్తు రుసుం కింద ఎస్సీ, ఎస్టీలు 500, ఇతరులు 1000 రూపాయిలు చెల్లించాలి.
అదనపు రుసుంతో దరఖాస్తులను మే 25వ తేదీ వరకూ అనుమతిస్తారు. హాల్‌టిక్కెట్లను మే 22 నుండి మే 27వ తేదీ వరకూ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్ధులు రెండు గంటల్లో 120 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పీజీఈసెట్ డాట్ టీఎస్‌సీహెచ్‌ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పీజీ ఈసెట్ తొలి సమావేశం ఉన్నత విద్యా మండలిలో గురువారం నాడు జరిగింది.
ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, సెట్ కన్వీనర్ , ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం కుమార్, కమిటీ సభ్యులు పీ రమేష్ బాబు, ప్రొఫెసర్ ఎస్ ఫాతిమా, ప్రొఫెసర్ పీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ ప్రవీణ్‌కుమార్, ప్రొఫెసర్ భండారి, ప్రొఫెసర్ ఫణి శ్రీ హాజరయ్యారు.
129 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్ కోర్సుల్లోనూ, 96 ఎం ఫార్మసీ కాలేజీల్లో, 14 ఫార్మా బీ (పీబీ) కోర్సుల్లో, మూడు ఎం ఆర్కిటెక్చర్ కోర్సుల్లో అడ్మిషన్లకు పీజీ ఈసెట్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు.