తెలంగాణ

స్థానిక సంస్థలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: తెలంగాణలోని స్థానిక సంస్థలకు చేయూత ఇస్తానని రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జి. రాజేశంగౌడ్ తెలిపారు. తెలంగాణ ఆర్థిక కమిషన్ కార్యాలయం కొత్త ఛాంబర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు సచివాలయంలో ఉన్న ఆర్థిక కమిషన్ కార్యాలయానికి ఎర్రమంజిల్ (హైదరాబాద్) లోని రోడ్లుభవనాల శాఖ భవన సముదాయంలోని మొదటి అంతస్తును ప్రభుత్వం కేటాయించింది. కొత్త భవనంలో గురువారం ఉదయం హిందూసాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశంగౌడ్ మాట్లాడుతూ, కొత్త కార్యాలయం ఏర్పాటు కావడం వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులతో తరచూ సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడ్డదన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో తనకు ఉన్న అనుభవం రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ను సరైన మార్గంలో నడిపేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లు స్వయంగా సమర్థతగా పరిపాలను కొనసాగించాలన్నదే తన ఉద్దేశమన్నారు. సమాజాభివృద్ధిలో స్థానిక పాలనకే ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు. స్థానిక సంస్థల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తూ వస్తున్నాయని గుర్తు చేశారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్థానిక సంస్థలకు నిధుల అవసరం పెరిగిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక కమిషన్ నివేదికను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కమిషన్ సభ్యుడు ఎం. చెన్నయ్య, మెంబర్-సెక్రటరీ సురేష్ చందా తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ఎస్‌ఎఫ్‌సీ కొత్త భవనంలో పూజలు నిర్వహిస్తున్న రాజేశంగౌడ్