తెలంగాణ

భారతీయ విద్యార్థులంటే చులకన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: భారతీయ విద్యార్థులపై అండర్ కవర్ స్టింగ్ ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని సీనియర్ న్యాయవాదులు, అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఇమిగ్రేషన్ -కస్టమ్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ సభ్యుడు , భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి నేతృత్వంలోని రిపబ్లిక్, డెమోక్రాట్ల బృందం ఈ మేరకు హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి కూడా ఒక లేఖ రాశారు. నిర్బంధంలో ఉన్న విద్యార్ధుల విచారణ సరైన రీతిలో జరుగుతోందా లేదా అనే విషయాన్ని కూడా వారు వాకాబు చేశారు. న్యాయపరంగా దక్కాల్సిన అన్ని హక్కులు భారతీయ విద్యార్థులకు కల్పిస్తున్నారా లేదా అన్న దానిపై వివరాలు కోరారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు సహా తాజా సమాచారం ఎప్పటికపుడు తెలియజేయాలని వారు కోరారు. కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తితో పాటు థామస్ ఆర్ సౌజీ, రాజ్ వుడాల్, కాంగ్రెస్ మహిళ బ్రెండా లారెన్స్‌లు డీఎస్‌హెచ్ కార్యదిర్శ క్రిస్టీనా ఎం నీల్సన్‌కు, ఐసీఈ డైరెక్టర్ రోనాల్డ్ డీ విటిల్లోకు ఈ లేఖలు పంపించారు. నకిలీ విశ్వవిద్యాలయం పేరుతో 130 మంది విదేశీ విద్యార్థుల నుండి డబ్బులు వసూలుచేసి అక్రమ వీసాలు ఇప్పించారనే ఆరోపణలపై అమెరికా హోం ల్యాండ్ అధికారులు మధ్యవర్తులుగా వ్యవహరించిన 8 మంది భారతీయ విద్యార్ధులను అరెస్టు చేశారు. దాంతో పే అండ్ స్టే రాకెట్ గుట్టురట్టయింది. ఇందుకోసం డెట్రాయిట్ మిచ్చిగన్‌లో ఫర్మింగ్టన్ యూనివర్శిటీ పేరుతో ఒక నకిలీ యూనివర్శిటీని స్థాపించి అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పటికే అమెరికా హోం ల్యాండ్ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులతో భారతీయ రాయబార కార్యాలయ అధికారులు సంప్రదింపులు జరపడమేగాక, వారికి అవసరమైన న్యాయసహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది, మరో పక్క అమెరికాలోని భారతీయ సంఘాలు సైతం విద్యార్థులకు బాసటగా నిలిచాయి.
చిత్రం..భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి