తెలంగాణ

సమాజాభివృద్ధికి ఖనిజ సంపద దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: ఖనిజాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం వల్ల సమాజ అభివృద్ధికి చేయూత ఇచ్చినట్టు అవుతుందని భూవిజ్ఞాన సర్వేక్షణ శిక్షణా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సిహెచ్. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కవాడిగూడాలోని కేంద్ర ప్రభుత్వ భవన సముదాయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భూగర్భ విజ్ఞానం గురించి శాస్తవ్రేత్తల్లో, విద్యార్థుల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందన్నారు. భూ విజ్ఞాన సర్వేక్షణ శిక్షణా సంస్థ 1976 లో హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. భూగర్భ విజ్ఞానానికి సంబంధించి శాస్తవ్రేత్తలకు అవసరమైన పరిజ్ఞానాన్ని శిక్షణా కార్యక్రమాల ద్వారా అందిస్తోందన్నారు. భూవిజ్ఞాన రంగంలో పరిశోధన, విస్తరణకు తమ సంస్థ సహకరిస్తోందన్నారు. ఇప్పటి వరకు 32 వేల మంది భూసంబంధమైన విజ్ఞానులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే 62 దేశాలకు చెందిన 433 మంది విద్యార్థులకు కూడా భూగర్భ శాస్త్రంలో శిక్షణ ఇచ్చామన్నారు. ఇటీవలే భారతీయ భూవిజ్ఞాన సర్వేక్షణ శిక్షణాసంస్థ ‘్భవిసంవాద్’ అనే కార్యక్రమం చేపట్టిందని, వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, విద్యార్థులకు అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఖనిజాల అనే్వషణలో తాము ఇచ్చే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతోందని, సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి, జీఎస్‌ఐ డైరెక్టర్ డాక్టర్ తారక్‌నాథ్ తదితరులు కూడా మాట్లాడారు.ఈ శిక్షణా సంస్థకు అనుబంధంగా ప్రాంతీయ శిక్షణా విభాగాలు నాగపూర్, కోల్‌కతా, లక్నో, జైపూర్, షిల్లాంగ్‌లలో ఉన్నాయన్నారు. భూ విజ్ఞానానికోసం నాలుగు క్షేత్రస్థాయి శిక్షణా సంస్థలు కూడా ఏర్పాటు చేశామన్నారు.