తెలంగాణ

మీ పనితీరు బావుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ పట్ల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి గురువారం గవర్నర్‌కు సమర్పించారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌కు వచ్చిన నాగిరెడ్డి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నివేదికను గవర్నర్‌కు అందించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థతగా నిర్వహించడం గొప్ప విజయమని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు వాస్తవంగా 2018 జూలైలోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక, న్యాయపరమైన కారణాల వల్ల ఆరునెలల పాటు ఆలస్యంగా జరిగాయని నాగిరెడ్డి తన నివేదికలో వివరించారు. జనవరి 21, 25, 30 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించామని తెలిపారు. 2019 జనవరి 1 న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా జిల్లాల్లోని రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ‘నోటీస్’ జారీ చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,751 గ్రామ పంచాయతీలకు గాను, 12,721 పంచాయతీలకు నోటీస్ జారీ చేశామన్నారు. వీటిలో 2,135 పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, మిగతా స్థానాలకు పోటీ జరిగిందని వివరించారు. అలాగే 1,13,153 వార్డు స్థానాల కోసం ఎన్నికలకు నోటీస్ జారీ చేశామని తెలిపారు. 29,930 వార్డులకు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వివరించారు. మిగతా స్థానాలకు పోలింగ్ నిర్వహించామన్నారు. సర్పంచ్ స్థానాలకు, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగిన వెంటనే ఉపసర్పంచ్ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించి, పూర్తి చేశామన్నారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఇటీవలనే పదవీ ప్రమాణం చేశారని నాగిరెడ్డి వివరించారు. పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలు, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగినప్పటికీ, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేకుండా ప్రశాంతంగా పూర్తిచేశామన్నారు. శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుందనుకున్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పోలీస్, విద్య తదితర శాఖల సిబ్బంది తమకు సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
చిత్రం..పంచాయతీ ఎన్నికలపై గవర్నర్‌కు నివేదిక అందజేస్తున్న ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి