తెలంగాణ

బంద్ సంపూర్ణం జనగామలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జూన్ 10: వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పట్టణ బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం పార్టీలతో పాటు జిల్లా సాధన సమితి ప్రతినిధులు చౌరస్తాలో నినాదాలు చేస్తుండగా వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అనంతరం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న మంత్రి హరీష్‌రావుకు చౌరస్తాలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆందోళనకారులను ఆ ప్రాంతం నుంచి చెదరగొట్టి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అయినప్పటికీ బిజెపి జిల్లా నాయకుడు ఉడుగుల రమేష్ మంత్రి కాన్వాయ్ చౌరస్తా నుంచి వెళ్తుండగా పోలీసు కంట్రోల్ రూమ్ వెనక నుంచి ఆకస్మాత్తుగా కాన్వాయ్ ముందుకు నినాదాలు చేస్తూ దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. సమీపంలో ఉన్న పోలీసులు అప్రమత్తమై ఆయనను ఈడ్చి పోలీసు అధికారులు వారి పద్ధతిలో వాహనంలో తోశారు. వాహనంలో ఎక్కిన రమేష్ ప్రాణాలైనా అర్పిస్తాం.. జనగామ జిల్లా సాధిస్తామంటూ చేసిన నినాదానికి స్థానికంగా ఉన్న ప్రజలు ఆయనకు మద్దతుగా ప్రతి నినాదాలు చేశారు. టిడిపి పట్టణ అధ్యక్షుడు పోకల లింగయ్య, ఆర్తి అసోసియేషన్ అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న, మండల కమిటీ అధ్యక్షుడు వజ్జ పరుశరాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ధర్మపురి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, అధికార ప్రతినిధి రంగరాజు ప్రవీణ్‌కుమార్, పట్టణ కార్యదర్శి రంగు రవి, బిఎస్పీ నాయకుడు జేరిపోతుల కుమార్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, నాయకులు నారోజు రామేశ్వర చారి, రమేష్, లెనిన్, అంజయ్యతో పాటు సుమారు 30మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేశారు.

చౌరస్తాలో ప్రజలను చెదరగొడుతున్న పోలీసులు

ఉడుగుల రమేష్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు