తెలంగాణ

అందరూ సహకరిస్తేనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, జూన్ 10: ప్రజలందరి సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి దత్తత గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి గ్రామస్థులు, యువకులతో చర్చించారు. గ్రామస్థులంతా అభివృద్ధిలో భాగస్వాములు కావడం వల్ల గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, యువకులను గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రెండు పురాతన బావులు ఉన్నాయని, వాటిని పూడ్చేందుకుగాను జిల్లా కలెక్టర్ అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు వివరించారు. గ్రామంలో చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా పనికిరాని మట్టితో గ్రామంలో ఉన్న పురాతన బావులను పూడ్చివేసేందుకు కృషి చేయాలని ఇన్‌చార్జి ఎంపిడివో శ్రీనివాసచార్యను కోరారు. గతంలో మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్లు త్వరగా నిర్మించే విధంగా కృషి చేయాలని ప్రజలకు సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 12 వేల రూపాయలు ఇస్తుండగా ప్రకాష్‌రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యలో మరో నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ, డంపింగ్ యార్డు కోసం చేస్తున్న పనుల్లో పెద్దపెద్ద రాళ్లు వస్తున్నాయని, ఇన్‌చార్జి ఎంపిడివో దృష్టికి తీసుకురాగా ఇందుకు ఎంపిడివో స్పందిస్తూ ఆ రాళ్లను పగలగొట్టి ఇంకుడు గుంతల్లో వేసుకోవాలని సూచించారు.
పాఠశాలలో అదనపు
గదుల నిర్మాణానికి 10 లక్షలు
గ్రామంలో నూతనంగా నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల అదనపు రెండు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు సినీ నటుడు ప్రకాష్‌రాజ్ వివరించారు. హరితహారం పథకంలో భాగంగా కొండారెడ్డిపల్లి గ్రామానికి పండ్ల మొక్కలు సరఫరా చేసేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి.రాజు, గ్రామస్థులు పల్లె ఆనంద్‌కుమార్, ఉప సర్పంచ్ సూరం శ్రీనివాస్, మండల వైద్యాధికారి శివప్రసాద్ పాల్గొన్నారు.

కొండారెడ్డిపల్లి గ్రామస్థులతో మాట్లాడుతున్న సినీ నటుడు ప్రకాష్‌రాజ్